PM Shram Yogi Mandhan Yojana 2023: ప్రతినెల రూ.55 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు రూ.3 వేల పెన్షన్ పొందొచ్చు.. ఎలాగంటే..?

Pradhan Mantri Shram Yogi Mandhan Scheme: మీరు ఇప్పటి నుంచే ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన స్కీమ్‌లో ప్రతి నెల రూ.55 నుంచి రూ.200 వరకు ఇన్వెస్ట్ చేస్తే.. వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందొచ్చు. అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అర్హులు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 10:53 AM IST
PM Shram Yogi Mandhan Yojana 2023: ప్రతినెల రూ.55 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు రూ.3 వేల పెన్షన్ పొందొచ్చు.. ఎలాగంటే..?

Pradhan Mantri Shram Yogi Mandhan Scheme Online: దేశంలోని పేద, దిగువ తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన స్కీమ్ చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇది అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ పథకాన్ని తీసుకువచ్చింది. అసంఘటిత కార్మికులు అంటే ఏ కంపెనీలోనూ పని చేయకుండా.. అసంఘటిత రంగాల్లో పనిచేసే వారు. వీరి కోసం బీజేపీ ప్రభుత్వం పీఎం శ్రమ యోగి మంధన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మీరు అసంఘటిత కార్మికులు అయితే.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు ఇలా..

దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు, చాకలివారు, రిక్షా/ఈ-రిక్షా డ్రైవర్లు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, టైలర్లు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇళ్లలో పనివారు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, ఇతర వృత్తులలో పనిచేస్తున్న కార్మికులు అర్హులు.

ఈ స్కీమ్‌లో అసంఘటిత కార్మికులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కాంట్రిబ్యూటరీ అంటే అందులో డబ్బు జమ చేయాలి. ఈ పథకం కింద లబ్దిదారుడు 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.3 వేల కనీస హామీ పెన్షన్ పొందుతారు. లబ్ధిదారుడు మరణించిన తర్వాత అతని భార్య లేదా భర్త కుటుంబానికి పెన్షన్‌గా 50 శాతం అందజేస్తారు. 

18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల దరఖాస్తుదారులు 60 సంవత్సరాల వయస్సు వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్య నెలవారీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తం లబ్ధిదారుడి వయస్సు, భవిష్యత్తులో అతను లేదా ఆమె ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి నెలా నిర్ణీత పింఛన్‌ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. మెచ్యూరిటీపై లబ్ధిదారుడికి నెలవారీ రూ.3 వేల పెన్షన్ లభిస్తుంది. 

షరతులు ఇవీ.. 

==> అసంఘటిత కార్మికుడి నెలవారీ ఆదాయం నెలకు రూ.15 వేలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
==> అతను ఏ వ్యవస్థీకృత రంగంలో (EPFO/NPS/ESIC) సభ్యుడు కాకూడదు.
==> దరఖాస్తుదారు పన్ను చెల్లింపుదారు కాకూడదు. 
==> లబ్ధిదారుడు తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/జన్ ధన్ ఖాతా నంబర్‌ను ఆధార్ కార్డ్, IFSC కలిగి ఉండాలి.
==> మీరు సమీపంలోని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, పొదుపు లేదా జన్ ధన్ ఖాతా, బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్, బ్యాంక్ స్టేట్‌మెంట్,  ఫొటోను మీ వెంట తీసుకెళ్లండి.

Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్

Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News