Infinix Smart 6 Plus Launch in India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ కానుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ పేరిట ఈ నెల 29న కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది మార్చిలో నైజీరియాలో ఈ మోడల్ లాంచ్ అయింది. మరో 2 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ధర :
నైజీరియాలో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ధర అక్కడి కరెన్సీలో 58400 (ఎన్జీఎన్-నైజీరియన్ నైరా)గా ఉంది. అంటే.. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.10,700 ఉండొచ్చు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ఫీచర్స్ :
వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో కూడిన 6.82 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
3జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ
5000mAh బ్యాటరీ సామర్థ్యం
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్పై ఇప్పటికైతే ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి అధికారికంగా ఎటువంటి వివరాలు బయటకు వెల్లడికాలేదు. స్మార్ట్ ఫోన్ లాంచ్ అయితేనే ఒరిజినల్ ఫీచర్స్, ధరపై స్పష్టత వస్తుంది. ఇండియాలో ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉండనుంది. కేవలం ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే దీని విక్రయాలు ఉండనున్నాయి.
Also Read: స్మృతి మంధాన టూ దీపికా పల్లికల్.. కామన్వెల్త్ గేమ్స్ 2022లో పోటీపడే అందమైన భామలు వీరే!
Also Read: Oppo A74 5G: ఒప్పో ఏ74 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.990కే... ఆఫర్ ఈ ఒక్కరోజే...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook