New Model Bajaj Pulsar Ns 400: ఆటో కంపెనీ బజాన్ త్వరలోనే తమ కస్టమర్స్‌కి మరో గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే తమ కొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనిని మే 3వ తేదిన ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొత్త మోడళ్లలో బజాజ్ పల్సర్‌ను NS160, NS200ను మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఇవి కొత్త అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త పల్సర్ NS400 వెనుక టైర్‌తో సింగిల్-సైడ్ మౌంట్ రియర్ టైర్ హగ్గర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ బైక్ అనేక ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త పల్సర్ NS400 సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్వరలోనే లాంచ్ కాబోయే బజాజ్ పల్సర్ బైక్, 373.3 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ ఇంజన్ గరిష్టంగా 40PS శక్తితో పాటు 35Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే సమర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు కూడా సమాచారం. ఈ కొత్త పల్సర్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ బైక్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది ప్రీమియం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు బ్లూటూత్‌తో పాటు అనేక రకాల కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫుల్ LED లైటింగ్ సిస్టమ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. కంపెనీ ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ను అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బజాజ్ పల్సర్ NS400 ధర వివరాల్లోకి వెళితే, దీని ధర సుమారు రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ భారత్‌లో వీలైనంత త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ బైక్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే, ట్రయంఫ్ స్పీడ్ 400, హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 401, KTM 390 డ్యూక్ వంటి పవర్ ఫుల్ బైక్‌లతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి