Andhra Pradesh: ఒక్కరోజులోనే 5 వేలకు పైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 

Last Updated : Jul 19, 2020, 08:00 PM IST
Andhra Pradesh: ఒక్కరోజులోనే 5 వేలకు పైగా  కరోనా కేసులు

Coronavirus: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) లో గత 24 గంటల్లో 5,041 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారితో 56 మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,650 కి పెరిగింది. ఈ రోజు మరణించిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 642 మంది మృతిచెందారు. Also read: AP: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటివరకు 22,890 మంది పలు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 26,118 మంది ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 31,148 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,15,532 మందిని పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. Also read: AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?

గత 24 గంటల్లో అత్యధికంగా.. తూర్పుగోదావరి జిల్లాలో 647,  అనంతపురం జిల్లాలో 637, శ్రీకాకుళం జిల్లాలో 535 కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో 300 కేసులు దాటాయి. గత 24గంటల్లో కరోనాతో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూలు, విశాఖపట్నం, కృష్ణాలో ఏడుగురు చొప్పున మృతిచెందారు.

Also read: Health Tips: గొంతు నొప్పికి ఇలా చెక్ పెట్టండి

Trending News