అధికారం, అవినీతి పాలునీళ్లలా కలిసి పోయాయి: ఏపీ సీఎం జగన్

అధికారం, అవినీతి పాలునీళ్లలా కలిసి పోయాయి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్

Last Updated : Aug 15, 2019, 11:50 AM IST
అధికారం, అవినీతి పాలునీళ్లలా కలిసి పోయాయి: ఏపీ సీఎం జగన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారం, అవినీతి పాలునీళ్లలా కలిసి పోయాయని, ఇలాంటి వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ ప్రశ్నించుకోవాలని అన్నారు. పేదలు, రైతులకు తక్కువ ధరకే విద్యుత్ సౌకర్యం అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్.. స్థానికులకే మేలు జరగాలనే ఉద్దేశంతో పరిశ్రమల్లో 70% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టాలు చేస్తే ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Trending News