YSR Aasara: చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారన్న ఏపీ సీఎం జగన్, ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభం

YSR Aasara scheme second tranche financial assistance:  ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ గత ఏడాది శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి రెండో విడతలో ఏపీ వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ చేయనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 01:59 PM IST
  • నేటి నుంచి రెండో విడత ‘వైఎస్సార్‌ ఆసరా’ పంపిణీ
  • ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించిన ఏపీ సీఎం జగన్‌
  • 7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి
  • తొలి రోజు 83 వేల సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ
YSR Aasara: చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారన్న ఏపీ సీఎం జగన్, ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభం

Andhra Pradesh CM Jagan Mohan Reddy releases YSR Aasara scheme second tranche financial assistance: ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండో విడత మొత్తాన్ని డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan Mohan Reddy) ప్రారంభించారు. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల ( dwakra groups) పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ గత ఏడాది శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి రెండో విడతలో ఏపీ వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ చేయనున్నారు.

ఒంగోలులోని (ongole) పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ (YSR Aasara) ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వైఎస్‌ జగన్‌ (YS Jagan) అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి బాధలు చూశానన్నారు ఆయన. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు.

Also Read : Prabhas25: ప్రభాస్ 25వ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు..పోస్టర్ రిలీజ్!

రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నాం అని తెలిపారు. నాలుగు విడతల్లో రూ.25,512 కోట్లు జమ చేస్తాం స్పష్టం చేశారు. కోడ్‌ దృష్ట్యా వైఎస్సార్‌ జిల్లాలో నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను (dwakra group women) మోసం చేశారన్నారు. చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని సీఎం అన్నారు.

ఇక గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది. 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం (ap government) నిర్ణయించింది. ఇక తొలి రోజు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోని 83,026 సంఘాల్లోని 8.19 లక్షల మందికి డబ్బు పంపిణీ చేస్తారు.

Also Read : MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌‌ అజయ్ భూపతి పోస్ట్‌ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News